పాన్ ఇండియా మూవీగా నాగార్జున ‘ది ఘోస్ట్’?

Sep 26 2021 @ 14:05PM

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. ‘గరుడ వేగ’ తరహాలో స్పై అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని మెప్పించింది. ఇక ఈ కథాంశానికి యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున ‘ది ఘోస్ట్’ ను పాన్ ఇండియాలో స్థాయిలో బహుభాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని టాక్. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలొస్తున్నాయి. 


ఇక కాజల్ స్థానంలో సీనియర్ హీరోయిన్స్ అయిన త్రిష, శ్రియా శరణ్ లో ఒకరిని ఆ పాత్రకు ఫైనల్ చేయొచ్చని కూడా టాక్ కూడా వినిపించింది. అయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి... కథానాయికగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సెలెక్ట్ చేస్తున్నారని సమాచారం. అప్పుడే కొంత పార్ట్ ను షూట్ చేసుకొన్న ‘ది ఘోస్ట్’ చిత్రం నాగ్ కు ఓ కొత్త తరహా చిత్రం అవుతుందని దర్శకుడు చెబుతున్నారు. మరి ఈ సినిమా నాగ్ కు ఏ రేంజ్ మూవీ అవుతుందో చూడాలి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.