అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-03-07T04:24:22+05:30 IST

మండలంలోని పెన్నా పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక, కనిగిరి రిజర్వాయర్‌ ప్రాంతం గ్రావెల్‌ను అక్రమంగా తరలించే వారిని అడ్డుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి ముత్యాల గుర్నాథం డిమాండ్‌ చేశారు.

అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి
కనిగిరి రిజర్వాయర్‌ వద్ద టిప్పర్‌కు గ్రావెల్‌ లోడు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

సీపీఎం నాయకుడు ముత్యాల గుర్నాఽథం

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 6 :మండలంలోని పెన్నా పరీవాహక ప్రాంతాల నుంచి  ఇసుక, కనిగిరి రిజర్వాయర్‌ ప్రాంతం  గ్రావెల్‌ను అక్రమంగా తరలించే వారిని అడ్డుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి ముత్యాల గుర్నాథం డిమాండ్‌ చేశారు.  మండలంలోని 920 సర్వే నెంబరులోని కనిగిరి రిజర్వాయర్‌ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతున్న ప్రాంతాన్ని  టీడీపీ నాయకులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 పెద్ద యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ  సుమారు 50 టిప్పర్లుతో తరలిస్తుండడంతో, రోడ్డు అధ్వాన్నంగా తయారవడంతోపాటు, రాత్రివేళల్లో టిప్పర్ల సంచారంపై ప్రజలు భయాందోళనకు గురౌతున్నారన్నారు. ఈ గ్రావెల్‌ మాఫియాకు అధికారపార్టీ నాయకుల అండదండలున్నాయన్నారు.   మినగల్లు, శ్రీరంగరాజపురం గ్రామాల్లోని పెన్నా పరీవాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్నారు. ఈ విషయంపై తహసీల్దారుకు విన్నవించగా, పెన్నా బ్యారేజీ  నిర్మాణానికి గ్రావెల్‌ తరలించేందుకు అనుమతులున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జానీభాషా, చల్లకొలుసు మల్లికార్జున, టీడీపీ నాయకులు ఎంవీ. శేషయ్య, విల్సన్‌, హరనాథ్‌, నాగరాజు, వల్లూరు శ్రీనివాసులు. చోటు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T04:24:22+05:30 IST