క్వారీ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2022-05-19T06:25:56+05:30 IST

క్వారీ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి

క్వారీ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ అర్జునుడు

 గన్నవరం, మే 18: క్వారీ అక్రమ తవ్వకా లను అడ్డుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్‌ చేశారు.  కొండపావులూరు సర్వే నెంబర్‌ 6, ముదిరాజుపాలెం, చనుపల్లివారిగూడెం గ్రామాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతూ బుధవారం తహసీ ల్దార్‌ నరసింహారావుకు వినత్రిపత్రాన్ని అందజే శారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల పేరుతో  అక్రమ మైనింగ్‌కు వైసీపీ నాయకులు తెగబ డ్డారన్నారు. ఎక్కడ ఎర్రమట్టి కనిపిస్తే అక్కడ గోతులు పెట్టి తవ్వే పనిలో ఉన్నారన్నారు. పచ్చటి చెట్లతో కళకళలాడే కొండలు నేడు అంతరిం చిపోతు న్నాయ న్నారు.  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వర రావు, నాయ కులు జూపల్లి సురేష్‌, తంగిరాల శ్రీనివాసరావు, పరిటాల గణేష్‌, పరిటాల జోగేంద్ర పాల్గొన్నారు.  

ఏపీలో సమర్థులు లేరా?

  సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్న వారికి జగన్‌రెడ్డి రాజ్యసభ సీట్లు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఇవ్వడానికి  వెనుకబడిన వర్గాల్లో సమర్థులు లేరా అని ఎమ్మెల్సీ బచ్చుల అర్జును డు ప్రశ్నించారు.  మండలంలోని అల్లాపురంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం, బాదుడే బాదుడు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కొవ్వొ త్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ గ్రామాఽ ద్యక్షుడు మన్నెం శ్రీనివాసరావు, కార్యదర్శి మల్లవల్లి నరసింహారావు, నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు, బోడపాటి రవికుమార్‌, దొంతు చిన్నా, జూపల్లి సురేష్‌, మేడేపల్లి రమ,  చిక్కవరపు నాగమణి, మోదుగుమూడి సత్యనారాయణ, కొసరాజు సాయి, ఆరుమళ్ల కృష్ణారెడ్డి, కంచర్ల ఈశ్వరరావు, మండవ రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-19T06:25:56+05:30 IST