ఆక్రమణలు తొలగించాలి

Published: Tue, 18 Jan 2022 00:59:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ఆక్రమణలు తొలగించాలి స్పందనలో అర్జీ ఇస్తున్న కేసరపల్లి గ్రామస్తులు

గన్నవరం, జనవరి 17: మండలంలోని కేసరపల్లిలో ఆర్‌ఎస్‌ నెంబర్‌ 196-4లో నాలుగు సెంట్లు స్థలాలన్ని 2008లో డాక్టర్‌ అంబేడ్కర్‌, మహాత్మ జ్యోతిరావ్‌పూలే విగ్రహాలు, స్మారక భవనాల ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం చేసింది. అయితే ఆ స్థలం ఆక్రమణకు గురైందని, ఆక్రమణలను తొలగించి విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ వీవీఎం కృష్ణకు గ్రామస్తులు అర్జీని అందజేశారు.  ఈ కార్యక్ర మంలో ఎం.ఆంతోని, రవికుమార్‌, ఏసుపాదం, కాంతారావు, బాపట్ల రవి కుమార్‌, బండి భాస్కరరావు, చింతపల్లి దావీదురాజు పాల్గొన్నారు. తహసీ ల్దార్‌ కార్యాలయంలో కూడా అర్జీ అందజేయనున్నట్టు తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.