కుటుంబ సమేతంగా స్కాట్లాండ్‌కు బయల్దేరి వెళ్లిన అక్షయ్ కుమార్!

Aug 7 2020 @ 00:16AM

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. తన తదుపరి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని.. చాలా దేశాలు.. ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో టూరిస్ట్‌లకు స్వాగతం పలుకుతున్నాయి. బ్రిటన్ కూడా తమ దేశంలోకి పర్యాటకులు రావడానికి అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన తదుపరి సినిమా ‘బెల్ బాటమ్’ షూటింగ్ కోసం కుటుంబ సమేతంగా స్కాట్లాండ్‌కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం స్కాట్లాండ్‌కు బయల్దేరి వెళ్లిన వారిలో లారా దత్తా, హ్యూమా ఖురేషి, వాణీ కపూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా సృష్టించిన అలజడి తర్వాత విదేశాల్లో షూటింగ్ ప్రారంభించిన మొదటి ఇండియన్ సినిమా ‘బెల్ బాటమ్’ ఏ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 


Follow Us on:

ఓవర్సీస్ సినిమామరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.