కాశ్మీర్‌ ఫైల్స్‌కు కాషాయ రంగు

ABN , First Publish Date - 2022-03-22T16:31:01+05:30 IST

కాశ్మీర్‌లో పండిట్ల బహిష్కరణ జరిగింది వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలోనేనని, ఆయన ప్రభుత్వం మనగూడింది బీజేపీ మద్దతుతోనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి పేర్కొన్నారు.

కాశ్మీర్‌ ఫైల్స్‌కు కాషాయ రంగు

టీఎన్‌సీసీ నేత అళగిరి 

వీపీ సింగ్‌ హయాంలోనే 

కాశ్మీర్‌ పండిట్ల బహిష్కరణ

నాటి ప్రభుత్వానికి బీజేపీ మద్దతు

మతకలహాలు రెచ్చగొట్టేందుకే 

బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ పన్నాగాలు

 పాలన వదిలేసి, సినిమా ప్రచారమా?


ప్యారీస్‌, మార్చి 21: కాశ్మీర్‌లో పండిట్ల బహిష్కరణ జరిగింది వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలోనేనని, ఆయన ప్రభుత్వం మనగూడింది బీజేపీ మద్దతుతోనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి పేర్కొన్నారు. అయితే చరిత్రను వక్రీకరించి,ఆ పాపాన్ని ఇతర ప్రభుత్వాలపై నెట్టడం కాషాయ పార్టీ నేతల దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.ఆ ఘటనలు జరిగింది నెహ్రూ,ఇందిరాగాంధీ,రాజీవ్‌గాంధీ హయాంలలో కాదని, వీపీ సింగ్‌ ప్రభుత్వ కాలంలోనేని వివరించారు.‘కాశ్మీర్‌ బెల్స్‌’ చిత్రం ప్రదర్శన థియేటర్లలో ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు రకరకాలుగా ప్రతిజ్ఞబూనుతున్నారని ఎద్దేవా చేశారు.పండిట్ల బహిష్కరణ ఘటనలు బీజేపీ మద్దతుతో సాగిన వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు తప్పు ఎవరిదో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. అన్ని రంగాల్లోనూ విఫలమైన నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. పాలన వ్యవహారాన్ని పక్కనబెట్టి ‘కాశ్మీర్‌ బెల్స్‌’ సినిమా ప్రచారం చేసుకుంటుందోన్నారు. అన్నిట్లో విఫలమవ్వడం వల్లనే, మరో మార్గం లేకపోవడంతో మతకల్లోలాలు రెచ్చగొట్టే సినిమాను ప్రమోట్‌ చేసే పనిలో పడిందన్నారు.


అయితే రాజకీయ లబ్ది కోసం కాషాయ నేతలు, మతకలహాలు రెచ్చగొట్టే ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో శనివారం ఉదయం కేఎస్‌ అళగిరి సమక్షంలో తమిళ మానిల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సుకుమార్‌ ఆ పార్టీ నుంచి వైదొలిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామన్‌, జిల్లా అధ్యక్షులు ద్రవ్యం, ఢిల్లీబాబు, రంజన్‌కుమార్‌ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అళగిరి మీడియాతో మాట్లాడుతూ... వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన కాంగ్రె్‌సకు ‘డబుల్‌ ఇంజన్‌’ (జంట నాయకత్వం) అవసరం లేదని, రాహుల్‌ గాంధీ లాంటి యువకులు ముందుకు వస్తే చాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-03-22T16:31:01+05:30 IST