వట్‌పల్లిలో అలయ్‌ బలయ్‌..

ABN , First Publish Date - 2021-10-17T04:41:48+05:30 IST

విజయదశమి సంబురాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. శాసనమండలి ప్రోటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎంపీ బీబీపాటిల్‌, మహిళా కమిషన్‌ చైర్మన్‌ సునీతాలక్ష్మారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ హాజరయ్యారు.

వట్‌పల్లిలో అలయ్‌ బలయ్‌..
ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డితో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అలయ్‌ బలయ్‌

వట్‌పల్లి, అక్టోబరు 16 : విజయదశమి సంబురాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. శాసనమండలి ప్రోటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎంపీ బీబీపాటిల్‌, మహిళా కమిషన్‌ చైర్మన్‌ సునీతాలక్ష్మారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ హాజరయ్యారు. గాయని మంగ్లీ, మిట్టపల్లి సురేందర్‌, జబర్దస్త్‌ కళాకారుల కార్యక్రమాలు అలరించాయి. సభ్యులు హజరయ్యారు. ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్‌ యార్డు మైదానం నిండిపోయింది. తెలంగాణ సంస్కృృతిని అద్దంపట్టేలా వేడుకలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కృషి అమోఘమని శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అలాయ్‌.. బలాయ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ, వట్‌పల్లిలో క్రాంతికిరణ్‌ మాత్రమే అలయ్‌ బలయ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. క్రాంతికిరణ్‌ కృషితో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ క్రాంతికిరణ్‌ ప్రజల మనిషి అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా క్రాంతికిరణ్‌ ముందున్నారని పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ చెర్మన్‌ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల సహకారంతో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మెచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా ప్రభావంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురయ్యాయన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్మోన్‌రెడ్డి, హెచ్‌సీఏ సభ్యుడు జయపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రజనీకాంత్‌, వరం అధ్యక్షుడు వీరారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు హజరయ్యారు.

Updated Date - 2021-10-17T04:41:48+05:30 IST