
గుంటూరు: ఏపీలో పాలన లేదనడానికి వెంకట నారాయణ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.మంగళవారం ఆమన మీడియాతో మాట్లాడుతూ.. గుప్తా ను కొడుతూ ఎవరికి చూపించడానికి ఫోన్‌లో వీడియో రికార్డు చేశారని ప్రశ్నించారు. ఏపీలో మద్యం షాపులు 24 గంటలు నడుస్తున్నాయని మండిపడ్డారు. పగలు అధికారులు వైన్‌షాపులు నిర్వహిస్తుంటే... రాత్రి వేళ వైన్ షాపులను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దళితులపైనే నిత్యం దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వెంకట నారాయణపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి