‘మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చింది’

ABN , First Publish Date - 2022-08-08T22:01:15+05:30 IST

‘మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చింది’

‘మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చింది’

విజయవాడ: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారన్నది బూటకమని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చిందన్నారు. జగన్‌కు దమ్ముంటే హైదరాబాద్‌లోని సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని సూచిచించారు. గోరంట్లపై చర్య తీసుకోకుంటే జగన్‌ను ప్రజలు సస్పెండ్ చేస్తారని మంత్రి ఆలపాటి పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ అంశంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే

Updated Date - 2022-08-08T22:01:15+05:30 IST