హాలీవుడ్ టెక్నాలజీతో 'సలార్'..!

Sep 25 2021 @ 11:08AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. ఈ మూవీని హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారట. 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దీని చిత్రీకరణ ముంబైలో శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకముందెన్నడు లేని విధంగా హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. హాలీవుడ్‌లో రూపొందిన 'మ్యాట్రిక్స్' 'బ్యాట్ మ్యాన్' లాంటి చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో 'సలార్' చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారట. ఇదే నిజమైతే భారతీయ సినీ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.