అలసంద వడలు

ABN , First Publish Date - 2020-09-15T21:55:10+05:30 IST

అలసందలు - 250 గ్రా., ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 4, అల్లం - అంగుళం ముక్క, జీలకర్ర - ఒక టేబుల్‌

అలసంద వడలు

కావలసిన పదార్థాలు: అలసందలు - 250 గ్రా., ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 4, అల్లం - అంగుళం ముక్క, జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూను, కరివేపాకు, కొత్తిమీర తరుగు - అరకప్పు చొప్పున, నూనె - వేగించడానికి సరిపడా. 

 

తయారుచేసే విధానం: అలసందలను 7 గంటలు నానబెట్టి నీరు వడకట్టాలి. తర్వాత కల్లుప్పు కలిపి బరకగా రుబ్బుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి రుబ్బిన పేస్టు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపాలి. తర్వాత వడలుగా వత్తి, మధ్యలో రంధ్రం పెట్టి కాగిన నూనెలో వేసి దోరగా వేగించాలి. వీటికి అల్లం పచ్చడి మంచి కాంబినేషన్‌.



Updated Date - 2020-09-15T21:55:10+05:30 IST