ఫైర్ ఇంజిన్ దొంగిలించి.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-06-30T23:39:21+05:30 IST

ఫైర్ ఇంజిన్‌ను దొంగతనం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫైర్ ఇంజిన్ దొంగిలించి.. అమెరికాలో..

నాక్‌నెక్: ఫైర్ ఇంజిన్‌ను దొంగతనం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాసన్ కోడీ పోర్టర్ అనే వ్యక్తి నాక్‌నెక్ ప్రాంతంలో ఉన్న ఫైర్ స్టేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అనంతరం ఓ ఫైర్ ఇంజన్‌లోకి వెళ్లి గ్లాసు డోర్‌లను బద్దలు కొట్టుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అరగంట సేపు 15 మైళ్లు ఫైర్ ఇంజిన్ సైరన్‌తో ప్రయాణించి ఓ బార్‌కు చేరుకున్నాడు. బార్‌ దగ్గర ఫైర్ ఇంజిన్‌ను ఆపడంతో పోలీసు అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. బార్‌కు వెళ్లడానికే పోర్టర్ ఫైర్ ఇంజిన్‌ను దొంగిలించాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పోర్టర్ కారణంగా పదివేల ఆస్తినష్టం కలిగినట్టు అధికారులు తెలిపారు. పోర్టర్‌పై వివిధ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అమెరికాలో ఇటువంటి తరహా ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.

Updated Date - 2020-06-30T23:39:21+05:30 IST