మద్యపానంతో మెదడు క్షీణత

ABN , First Publish Date - 2022-03-15T18:36:50+05:30 IST

మద్యపానంతో కాలేయం పాడవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మద్యపానం అలవాటు ఉన్న వారిలో మెదడు కూడా క్షీణిస్తుందని యుకెలో జరిపిన ఒక పరిశోధనలో రుజువైంది.

మద్యపానంతో మెదడు క్షీణత

ఆంధ్రజ్యోతి(15-3-2022)

మద్యపానంతో కాలేయం పాడవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మద్యపానం అలవాటు ఉన్న వారిలో మెదడు కూడా క్షీణిస్తుందని యుకెలో జరిపిన ఒక పరిశోధనలో రుజువైంది.


రోజుకు ఒకటి లేదా రెండు ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ తీసుకునేవాళ్ల మెదడులో తెల్లని భాగం, బూడిద రంగు భాగాల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకోవడంతో పాటు మెదడు పరిమాణం కూడా తగ్గుతుందని నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో తాజా అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఒక రోజుకు పురుషులు రెండు డ్రింకులు, మహిళలు ఒక డ్రింక్‌ తీసుకోవచ్చని, సిడిసి (సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) సూచిస్తున్నప్పటికీ, తాజా అధ్యయనం ఆ సురక్షిత మద్యపాన పరిమితి కూడా  క్షేమకరం కాదని చెప్తోంది. పెరిగే వయసుతో పాటు మెదడు కూడా క్షీణిస్తుంది. అయితే ఈ క్షీణత మద్యపానంతో మరింత వేగం పుంజుకోవడమే కాకుండా, జ్ఞాపకశక్తినీ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను కూడా కుంటుపరుస్తుంది. అలాగే మితిమీరిన మద్యపానం వల్ల కాలేయం దెబ్బతినడంతో పాటు, గుండె జబ్బులు, పోషకాహార లోపాలు, కేన్సర్లు, వయసు వేగం పెరగడం మొదలైన నష్టాలకు కూడా ఆస్కారం ఉంటుంది. మద్యపానం చేయని వాళ్లతో పోలిస్తే, రోజుకు అర గ్లాసు బీరు తీసుకునే వారి మెదడు వయసు అరు నెలలకు పెరుగుతుందనీ, అలాగే రోజుకు నాలుగు డ్రింకులు తీసుకునే వారి మెదడు వయసు పదేళ్లకు పెరుగుతుందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-03-15T18:36:50+05:30 IST