సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం : డీపీవో

ABN , First Publish Date - 2021-07-27T05:23:52+05:30 IST

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీపీవో సుభాషిణి సోమవారం సూచించారు. జేఎన్‌టీయూలో నిర్వహిస్తున్న సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం : డీపీవో

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీపీవో సుభాషిణి సోమవారం సూచించారు. జేఎన్‌టీయూలో నిర్వహిస్తున్న సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో  ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సమష్టిగా పనిచేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  పల్లెల్లో పారిశుధ్యంపై దృష్టి సారించాలని, ఇందుకు గాను 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని చెప్పారు.  దోమలు , ఈగల నివారణకు మందు చల్లాలని తెలిపారు. ఎల్‌ఈడీ దీపాల మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయించాలని, రక్షిత నీటి పథకాలను శుభ్రం చేయించాలని  చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం నిర్వహించిన శిక్షణకు  దత్తిరాజేరు, మెం టాడ, విజయనగరం, జామి మండలాలకు చెందిన  103 మంది సర్పంచ్‌లు పాల్గొన్నారు.  4వేల జనాలకు మించిన పంచాయతీ సర్పంచ్‌లు 10 మంది సామర్లకోటలో జరిగే శిక్షణ తరగతులకు హాజరయ్యారు. డీపీవో కార్యాలయం నుంచి శ్రీనివాసరావు ఆచార్యులు, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-07-27T05:23:52+05:30 IST