వివస్త్రగా ఏనుగెక్కిన భామ.. తిట్టిపోసిన నెటిజన్లు

ABN , First Publish Date - 2021-02-21T01:11:36+05:30 IST

రష్యన్ మోడల్ అలెస్య కఫెల్కికోవాకు అర్థరాత్రి ఓ విచిత్రమైన కోరిక పుట్టింది.

వివస్త్రగా ఏనుగెక్కిన భామ.. తిట్టిపోసిన నెటిజన్లు

రష్యన్ మోడల్ అలెస్య కఫెల్కికోవాకు అర్ధరాత్రి ఓ విచిత్రమైన కోరిక పుట్టింది. సుమత్రా అనే పాపులర్ ఏనుగు మీద ఎక్కాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా ఏనుగు ఎక్కేసింది. ఏనుగు ఎవరైనా ఎక్కొచ్చు.. అది కాదు న్యూస్.. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా.. వివస్త్రగా ఏనుగెక్కి పోజులిచ్చింది ఈ అమ్మడు. అంతేకాదండోయ్.. తన నిర్వాకాన్ని వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పుడు మొదలయ్యాయి వయ్యారి భామకు తంటాలు. జంతు ప్రేమికులు, నెటిజన్లు ఆమెను ఉతికి ఆరేశారు. ‘నీకు అసలు బుద్ధుందా’ అంటూ తిట్లదండకాలు అందుకోవడంతో ఈ క్యాట్ వాక్ బేబేకి మతి పోయింది. దీంతో ఖంగుతిన్న ఈ రష్యన్ భామ అందరికీ సారీ చెప్పింది. 

Read more