gun Firing: దీని ముందుకెళ్తే.. కాల్చిపారేస్తుంది.. ఆల్రెడీ మార్కెట్‌లోకి కూడా వచ్చేసింది..

ABN , First Publish Date - 2022-07-25T00:51:39+05:30 IST

ఒక రకంగా అరాచకానికి ఇది ప్రతీక అని కొందరు అంటున్నారు. అసలీ రోబో (robot) ఇలా టపటపా కాల్చి పారేయడం ఏమిటని మరికొందరు కంగారు పడుతున్నారు. అలా మనుషులను..

gun Firing:  దీని ముందుకెళ్తే.. కాల్చిపారేస్తుంది.. ఆల్రెడీ మార్కెట్‌లోకి కూడా వచ్చేసింది..

ఒక రకంగా అరాచకానికి ఇది ప్రతీక అని కొందరు అంటున్నారు. అసలీ రోబో (robot) ఇలా టపటపా కాల్చి పారేయడం ఏమిటని మరికొందరు కంగారు పడుతున్నారు. అలా మనుషులను కాల్చి పారేస్తే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా సరే అది మార్కెట్‌లోకి వచ్చిసేంది. ప్రస్తుతం టెక్నాలజీ (Technology) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మరోవైపు రోబో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి (Development) చెందుతోంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేసేస్తున్నాయి. మనుషుల అవసరం లేకుండానే.. ఆ పనులన్నింటినీ రోబోలతోనే చేయిస్తున్నారు. ఇంటి పనులతో పాటూ హోటల్, రెస్టారెంట్, హాస్పిటల్స్ ఇలా.. అనేక రంగాల్లో రోబోలను ఉపయోగించుకుంటున్నారు.


మానవులకు రోబోలు చాలా సహయపడుతున్నాయి. తాజాగా ఇంటికి కాపలా ఉండేలా ఓ రోబోను తయారుచేశారు. మాములుగా ఇంటికి సెక్యూరిటీ కోసం కుక్కలను (dogs) పెంచుకుంటారు. అయితే ప్రస్తుతం వీటి స్థానంలో రోబో డాగ్స్ వచ్చేశాయి. ఇంటికి కాపలా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా (Social media) లో వైరల్‌గా మారింది. ఇది కుక్క లాగే అటూ ఇటూ తిరుగుతూ అత్యవసరమైతే కాల్చి పారేస్తోంది కూడా. రష్యా (Russia) కు చెందిన అలెగ్జాండర్ ఆటామానోవ్ ఈ రోబోను రూపొందించారు. ఈ రోబోను ఓ ఇంటి ముందు ఏర్పాటు చేశారు. దీనికి ఆటోమేటిక్ మెషిన్ గన్‌ను ((Automatic machine gun) సెట్ చేశారు. ఈ రోబోకి ఉన్న గన్‌ను తుపాకీ రష్యన్-పీపీ-19 విత్యాజ్, ఏకే-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఇవి ఆటోమేటిక్ మెషిన్ గన్ ద్వారా కాల్పులు జరుపుతాయి.

Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు..


అలెగ్జాండర్ ఆటామానోవ్ (Alexander Atamanov).. హోవర్ సర్ప్ అనే ఏరో పరిశ్రను నడుపుతున్నాడు. ఈ పరిశ్రమ కాలిఫోర్నియా (California) లోని శాస్ జోస్‌లో ఉంది. ఇదిలావుండగా, ఈ రోబో డాగ్‌కు గన్ పెట్టడం అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉందంటున్నారు. ఎవరి భయాలు ఎలా వున్నా.. ఎవరి ఆవిష్కరణలు వాళ్ళు చేసేస్తున్నారు. ఇలాంటి రోబోలు మనుషులపై దాడి చేస్తే.. యజమానులు నేరం నుంచి తప్పించుకోవడం చాలా సులభం అంటూ కొందరు చమత్కరిస్తున్నారు. యంత్రాన్ని యంత్రంలా వాడుకుంన్నంత వరకే మనిషికి బతుకు. అది చేయి దాటితే ఇక దొరకదు మెతుకు.. అంటూ మరికొందరు కామెంట్లు (Comments) పెడుతున్నారు.

woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..





Updated Date - 2022-07-25T00:51:39+05:30 IST