అలీకి పదవిపై విపరీతంగా ట్రోల్

ABN , First Publish Date - 2022-02-21T00:56:15+05:30 IST

నటుడు అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొన్ని రోజులుగా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది

అలీకి పదవిపై విపరీతంగా ట్రోల్

అమరావతి: నటుడు అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొన్ని రోజులుగా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తను అటు ప్రభుత్వం కానీ.. ఇటు అలీ కానీ ఖండించకపోవడంతో అదే నిజమైన వార్త అని అందరూ అనుకుంటున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా కొందరు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. అలీ ఇటీవల పలు మార్లు సీఎం జగన్ కలిశారు. దీంతో ఊహాగానాలకు ప్రచారానికి తెర లేసింది. అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదివి ఇస్తారన్నది ప్రచారం కాగా.. ఆయనను వైసీపీ తరపున రాజ్యసభకు పంపుతారనే మరో ప్రచారం. అలీ మాత్రం ఈ వదంతులను ఖండించలేదు. ఏదైనా సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారనే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ నియామకం ఎలా జరుగుతుంది అనే దానిపై చర్చ మొదలైంది. వక్ఫ్ బోర్డు సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌గా నియమిస్తారని ఓ వర్గం అంటోంది. మరికొందరు అందులో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. తమకు నచ్చిన వ్యక్తిని వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణలో ఇలాగే జరిగిందని నిపుణులు చెబుతున్నారు. 


నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను నెల రోజుల పాటు నోటిస్ బోర్డులో పెట్టి ఒకరికి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారన్నది మనో వాదన. అసలు పై రెండు ప్రచారాలు నిజం కాదు అన్నది తాజాగా వినిపిస్తున్న మాట. వక్ఫ్ బోర్డు సభ్యుల్లో ఒకరిని మాత్రమే చైర్మన్‌గా నియమించాల్సి ఉంటుందనేది తేలిపోయింది. సభ్యులందరూ సీఎం కలిసి వారిలో ఒకరిని చైర్మన్‌గా నియమించాలని ప్రతిపాదించే అవకాశం ఉంది. సీఎంకు నచ్చితే అదే వ్యక్తి పేరుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వీలుంటుంది. లేని పక్షంలో ఆయన మరో పేరును ప్రతిపాదించి అందరినీ ఒప్పించే వీలుంటుంది. అయితే ఆ వ్యక్తి కూడా వక్ఫ్ బోర్డు సభ్యుడై ఉండాలి. ఇటీవల వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకం జరిగింది. ఈ నియామకంపై కోర్టులో కేసులో దాఖలైంది. ఈ వ్యవహారం ఇంకా అడ్మిట్ దశ దాటలేదు. అంతలోనే అలీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. బోర్డు సభ్యుడు కాకుండా ఆయన చైర్మన్ అయ్యే అవకాశం లేదు. మరి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారికి ఈ విషయం తెలుసు లేదో అర్థం కావడం లేదు.  

Updated Date - 2022-02-21T00:56:15+05:30 IST