2021లో ట్విట్టర్‌ని ఏలిన బాలీవుడ్ తారలు వీరే.. వెనక్కి వెళ్లిన దీపికా ..

Published: Thu, 09 Dec 2021 12:00:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
2021లో ట్విట్టర్‌ని ఏలిన బాలీవుడ్ తారలు వీరే.. వెనక్కి వెళ్లిన దీపికా ..

మరికొద్ది రోజుల్లో 2021కి పలకున్న సమయంలో ఈ ఏడాది ఎక్కువగా ట్విటర్‌లో నిలిచిన బాలీవుడ్ తారల జాబితాను విడుదల చేసింది మేనేజ్‌మెంట్. అందులో ఎవరెవరూ ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి..


ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది సొట్టబుగ్గల సుందరి అలియాభట్. ఈ ఏడాది ఆ భామ కమిట్ అయిన క్రేజీ సినిమాల వల్ల ఈ లిస్ట్‌ నిలిచింది. ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్ఆర్ఆర్’, ‘గంగుభాయ్ కతియావాడి’, ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’, ‘తఖ్త్’ వంటి టాప్ హీరోలు, డైరెక్టర్ల సినిమాలను తన బుట్టలో వేసుకుంది ఈ తార.


రెండో స్థానంలో ప్రియాంక చోప్రా నిలించింది. ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్‌లో కనిపించడం వల్ల పాపులారిటీ పెంచుకుంది. ‘ది మ్యాట్రిక్స్ రిసరక్షన్’, ‘టెక్ట్స్ ఫర్ యూ’, ‘సిటాడెల్’ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్‌లో ఫరాన్ అక్తర్ డైరెక్షన్‌లో అలియా, కత్రినాతో కలిసి ‘జీ లే జారా’ అనే సినిమా చేస్తూ ఎక్కువ ట్విట్టర్‌లో నిలిచింది.

2021లో ట్విట్టర్‌ని ఏలిన బాలీవుడ్ తారలు వీరే.. వెనక్కి వెళ్లిన దీపికా ..

మోహిత్ సూరి దర్శకత్వంలో ‘ఎక్ విలన్ రిటర్న్స్’ సినిమాలో జాన్ అబ్రహం, తారా సుతారియా, అర్జున్ కపూర్‌తో కలిసి నటించి ఎక్కువగా ట్విట్టర్ నిలచింది. దీంతో ఈ బ్యూటీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.


ఈ లిస్ట్‌లో ఎప్పుడూ టాప్ 3లో ఉండే దీపికా ఈ సారి మాత్రం నాలుగో స్థానంలో నిలిచింది. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘83’, అమితాబ్‌తో కలిసి ఓ సినిమా, హృతిక్ రోషన్‌తో కలిసి ‘ఫైటర్’ సినిమా చేస్తూ ఎక్కువగా ట్విట్టర్‌లో నిలిచింది.


2018లో షారుక్ ఖాన్‌తో కలిసి ‘జీరో‌’ సినిమా చేసిన మరో సినిమాలో నటించలేదు. అయితే అమెజాన్ కోసం ‘పాతల్ లోక్’, నెట్‌ఫ్లిక్స్ కోసం ‘బుల్‌బుల్’ నిర్మించి ట్విట్టర్‌లో నిలిచింది. అంతేకాకుండా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య కావడంతో కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...