నవంబర్‌‌లో రాజస్థాన్‌లోని రిసార్ట్‌లో Alia Bhatt, Ranbir Kapoor ల నిశ్చితార్థం..?

Published: Sun, 14 Nov 2021 15:32:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నవంబర్‌‌లో రాజస్థాన్‌లోని రిసార్ట్‌లో Alia Bhatt, Ranbir Kapoor ల నిశ్చితార్థం..?

ఆలియా భట్, రణ్ బీర్ కపూర్‌లు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ఈ బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్‌కి నవంబర్ 29న నిశ్చితార్థం జరగబోతున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఒక రిసార్ట్‌‌లో వీరి నిశ్చితార్థం జరగనున్నట్టు సమాచారం. ఈ వార్తలపై స్పందించడానికి ఇరు వర్గాల వారు నిరాకరించారు. వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరగబోతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ, వివిధ ప్రాజెక్టులతో వారు బిజీగా ఉండటంతో పెళ్లిని  ఏప్రిల్‌ వరకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.


ఆలియా భట్ సన్నిహిత స్నేహితురాలైన అనుష్క రంజన్ నవంబర్ 21న ఆదిత్య సీల్‌ను పెళ్లి చేసుకోబోతుంది. ఆలియా వీరి పెళ్లికి స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసినట్టు  తెలుస్తోంది. అనుష్క రంజన్ పెళ్లిలో ఆలియా, రణ్ బీర్ కపూర్ డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. బ్రహ్మాస్త్ర అనే సినిమాలో ఆలియా, రణ్ బీర్ కపూర్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రను పోషించడం గమనార్హం. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...