
బాలీవుడ్లో క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఐదేళ్ల డేటింగ్ చేసిన ఈ లవ్‌బర్డ్స్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒకటైన విషయం తెలిసిందే. మ్యారేజ్ అయ్యి మూడు నెలల్లోపే ఈ బ్యూటీఫుల్ కపుల్ ఫ్యాన్స్‌కి మరో శుభవార్తని తెలియజేశారు. వారు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనేది ఆ వార్తా సారాంశం. ఈ విషయాన్ని తెలియజేస్తూ అలియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఆస్పత్రిలో స్కానింగ్ చేసుకున్న ఫొటోలను అలియా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దానికి ‘మా బెబీ.. త్వరలో రాబోతోంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అలియా, రణ్‌బీర్ దంపతులకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.