Karan Johar: తాగి పెళ్లిచేసుకోబోతున్న విక్కీ కౌశల్‌కి కాల్ చేసిన అలియాభట్, కరణ్ జోహార్.. కారణం అదేనంటూ..

Published: Thu, 18 Aug 2022 09:39:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Karan Johar: తాగి పెళ్లిచేసుకోబోతున్న విక్కీ కౌశల్‌కి కాల్ చేసిన అలియాభట్, కరణ్ జోహార్.. కారణం అదేనంటూ..

బాలీవుడ్‌లోని క్రేజీ షోస్‌లో ‘కాఫీ విత్ కరణ్(Koffee With Karan)’ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ టాక్ షోకి బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. ఈ షోలో గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతుంటాడు. ఈ షోకి తాజాగా యువ నటులు విక్కీ కౌశల్(Vicky Kaushal), సిద్ధార్థ్ మల్హోత్రా గెస్టులుగా వచ్చారు.


ఈ సందర్భంగా అలియాభట్‌(Alia Bhatt)తో కలిసి చేసిన ఓ క్రేజీ ఘటన గురించి కరణ్ పంచుకున్నాడు. కరణ్ మాట్లాడుతూ.. ‘నేను, అలియా కలిసి తాగాం. తర్వాత విక్కీకి కాల్ చేశాం. తాగుతూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఎవరికీ కాల్ చేయాలా అని ఆలోచిస్తూ.. చివరికీ విక్కీకి కాల్ చేశాం’ అని చెప్పుకొచ్చాడు.


అంతేకాకుండా.. ‘మా ఇద్దరికీ కత్రినా చాలా కాలంగా తెలుసు. ఆమె పెళ్లి చేసుకోవడం మాకు చాలా ఎమోషనల్‌గా, హ్యాపీగా అనిపించింది. అందుకే విక్కీ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో కాల్ చేశాం’ అని కరణ్ జోహార్ తెలిపాడు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో విక్కీ, సిద్ధార్థ్ చాలా ఉల్లాసంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ఇది చూస్తుంటే గత ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ మరింత సరదాగా ఉండబోతోందని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...