Alia కి ఒకేసారి చప్పట్లు కొడుతూ, అరుస్తూ, ఏడుస్తూ, డ్యాన్స్ చేయాలనిపించిందట! ఎందుకంటే...

Published: Fri, 24 Dec 2021 22:00:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Alia కి ఒకేసారి చప్పట్లు కొడుతూ, అరుస్తూ, ఏడుస్తూ, డ్యాన్స్ చేయాలనిపించిందట! ఎందుకంటే...

ఆలియా భట్ తన సంతోషాన్ని, ఉద్వేగాన్ని ఆపుకోలేక ఇన్‌స్టాగ్రామ్ బాట పట్టింది. ఆమె తన తాజా పోస్టులో రణవీర్ సింగ్, కబీర్ ఖాన్, ‘83’ మూవీ టీమ్ మొత్తాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. డిసెంబర్ 24న రిలీజ్ అయిన రణవీర్, దీపికా స్టారర్ స్పోర్ట్స్ డ్రామా చూశాక ఆలియా సూపర్ ఎగ్జైట్ అయింది. 


‘‘సినిమా చూస్తున్నంత సేపు ఎన్నోసార్లు... నాకు చప్పట్లు కొడుతూ, అరుస్తూ, ఏడుస్తూ, డ్యాన్స్ చేయాలనిపించింది!’’ అంటోంది ఆలియా భట్. ‘83’ సినిమా చాలా బావుందంటూ రివ్యూ ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ ‘‘ఈ అందమైన చిత్రం చూశాక మీరోక సరికొత్త వ్యక్తిగా థియేటర్ నుంచీ బయటకు వెళతారు’’ అంటూ తన భావోద్వేగాన్నివ్యక్తం చేసింది. 


కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో రణవీర్, దీపికా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘83’ సినిమా భారత క్రికెట్ జట్టు విజయగాథకి తెర రూపం. కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో భారత్ తన తొలి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆనాటి టీమిండియా చారిత్రక ప్రస్థానమే ‘83’ చిత్రం...   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...