గంగూబాయ్‌ సెట్‌లోకి అలియా

Jun 9 2021 @ 00:54AM

వచ్చే వారంలో ‘గంగూబాయ్‌ కతియావాడి’ సినిమా సెట్స్‌లోకి అలియా భట్‌ అడుగుపెట్టబోతున్నారు. గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’ నేపథ్యంలో సాగే పాట చిత్రీకరణలో  ఈ నెల 15 నుంచి పాల్గోనున్నారు. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ గీతాన్ని చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడే అలియా కరోనా బారిన పడ్డారు. గతంలో వందమంది జూనియర్‌ డ్యాన్సర్లతో ఈ పాటను తెరకెక్కించేందుకు అంతా సిద్ధం చేశారు. లాక్‌డౌన్‌తో షూటింగ్‌ నిలిచిపోవడం, ఇప్పుడు పరిమిత సంఖ్యలో సిబ్బందితో షూటింగ్‌ కొనసాగించాలనే నిబంధనల నేపథ్యంలో పది మంది జూనియర్‌ డ్యాన్సర్లతోనే ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం కొన్ని నెలల క్రితం నుంచే అలియా భట్‌ తన డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.