ఈ-పంచాయతీల ద్వారానే అన్ని ధ్రువీకరణ పత్రాలు

ABN , First Publish Date - 2021-04-18T05:00:10+05:30 IST

ఇకపై ప్రజ లకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కానీ ఇతరత్రా అవసరమైన వాటి ని ఈ-పంచాయతీల ద్వారానే పొందవచ్చ ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నా రు.

ఈ-పంచాయతీల ద్వారానే అన్ని ధ్రువీకరణ పత్రాలు
ఈ-పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- భూపతిపూర్‌లో భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 17: ఇకపై ప్రజ లకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కానీ ఇతరత్రా అవసరమైన వాటి ని ఈ-పంచాయతీల ద్వారానే పొందవచ్చ ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నా రు. మండంలోని భూపతిపూర్‌ గ్రామంలో రూర్బన్‌ నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ-పంచాయతీ భవనాన్ని శని వారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ఇతర సర్టిఫికెట్ల కోసం సుల్తానాబాద్‌, పెద్దపల్లి వెళ్ళాల్సిన పనిలేకుండా, మీ సేవా కేంద్రాలకు వెళ్ళ కుండానే ఈ-పంచాయతీ ద్వారా అన్ని సే వలు పొందవచ్చన్నారు. కేవలం 90 రోజు ల్లోనే ఈ-పంచాయతీ భవనాన్ని నిర్మించిన సర్పంచ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కవ్వంపల్లి జ మున తిరుపతి, ఎంపీపీ బాలాజీరావు, మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌, ఎంపీటీసీలు విజయరమణారెడ్డి, పులి అనూష, సత్యనారాయణరావు, మొలుగూరి అంజయ్య, తిరుపతి, పోచమల్లు, లింగమూర్తి, రాజు, శ్రీని వాస్‌, కనకయ్య, శ్రీనివాస్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T05:00:10+05:30 IST