కాశీ, మధుర, అయోధ్యలలో బీజేపీ హవా!

ABN , First Publish Date - 2022-03-10T17:04:40+05:30 IST

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైనది...

కాశీ, మధుర, అయోధ్యలలో బీజేపీ హవా!

up elections: దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైనది. హిందుత్వ కేంద్రంగా భావించే అయోధ్యలో రాముడి పేరుతో రాజకీయాలు నడుస్తుంటాయి. ఇక వారణాసి‌లో బీజేపీకి తిరుగులేదని అంటుంటారు. అయోధ్య, కాశీ తర్వాత మధుర వంతు వస్తుంది. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన గోరఖ్ పూర్ ఓటర్లు బాబాజీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటారు. 


దేశం యావత్తూ... ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. రామజన్మభూమి అయోధ్యను 2012లో మినహా 30 ఏళ్లుగా బీజేపీనే పాలిస్తూ వస్తోంది. అయోధ్యలోని సదర్, గోసాయిగంజ్, బికాపూర్, బిల్కీపూర్, రుదౌలీ స్థానాలు బీజేపీకి కంచుకోటగా ఉన్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం, మతపరమైన పర్యాటకం ఉపాధిని పెంచుతుందని బీజేపీ పేర్కొంది. యూపీలోని మధురలో 5 సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు అయోధ్య, కాశీ మాదిరిగా మధురను దివ్యధామంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇక కాశీ విషయానికొస్తే పింద్రా, అజ్రా, శివపూర్, రోహనియా, వారణాసి నార్త్, సౌత్, కాంట్, సేవాపురి తదితర 8 సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కాశీ కారిడార్‌ను బీజేపీ మరో మైలురాయిగా చెబుతుంటుంది. ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. 

Updated Date - 2022-03-10T17:04:40+05:30 IST