గ్వాలియర్‌లో ఫస్ట్ Drone School ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-11T15:23:15+05:30 IST

ఆల్ ఇండియా ఫస్ట్ ‘డ్రోన్ స్కూల్’ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభించారు....

గ్వాలియర్‌లో ఫస్ట్ Drone School ప్రారంభం

గ్వాలియర్ : ఆల్ ఇండియా ఫస్ట్ ‘డ్రోన్ స్కూల్’ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రారంభించారు.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం గ్వాలియర్‌లో తొలి డ్రోన్ పాఠశాలను ప్రారంభించారు.డ్రోన్ టెక్నాలజీ యువతకు అపారమైన సాంకేతిక అవకాశాలను కల్పిస్తుందని ముఖ్యమంత్రి చౌహాన్ చెప్పారు.గత ఏడాది డిసెంబర్‌లో గ్వాలియర్‌లో డ్రోన్ ఫెయిర్‌ను నిర్వహించడం ద్వారా డ్రోన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.


ఈ కార్యక్రమంలో డ్రోన్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, డ్రోన్ ఔత్సాహికులు, వినియోగదారుల సంఘాలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్రోన్ ప్రదర్శన,  పరిశ్రమ-వినియోగదారుల పరస్పర చర్యలు, కొత్త డ్రోన్ల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు.


Updated Date - 2022-03-11T15:23:15+05:30 IST