యూరప్‌లోని 63 నగరాల్లో తెలుగుదేశం 40వ వార్షికోత్సవ వేడుకలు

Published: Sun, 27 Mar 2022 08:29:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యూరప్‌లోని 63 నగరాల్లో తెలుగుదేశం 40వ వార్షికోత్సవ వేడుకలు

తెలుగుదేశం యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా.కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40వ వసంతోత్సవ వేడుకలు యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆ వేడుకలు కేవలం సంబరాలు చేసుకుడానికే కాకుండా, ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరిని కలసి వారి బాగోగులు తెలుసుకొని, స్థానిక సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతం చేసి అధికారం దిశగా పయనించడానికి ప్రణాళికలు రచించి అధినాయకత్వంతో పంచుకోవడానికి వేదిక కానున్నాయి. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది.


యూరప్ ఖండంలో నివసిస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులను 63 నగరాల్లో జరిగే వేడుకలకు సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఎన్.ఆర్.ఐ టీడీపీ సెల్ రాంప్రసాద్, రాజశేఖర్ అనుసంధానంతో ఐర్లాండ్- వెంకట కృష్ణ ప్రసాద్, నెదర్లాండ్స్-వివేక్, నార్వే - వెంకటపతి, డెన్మార్క్ - అమర్నాథ్, బెల్జియం - కొండయ్య, పోలాండ్ - చందు, ఫ్రాన్స్ - మహేష్, స్వీడన్ - ప్రవీణ్, పోర్చుగల్ - దశరధ్, మాల్టా - దినేష్, ఇటలీ - సతీష్, స్విట్జర్లాండ్ - శ్రీనివాస్, లాట్వియా - మీరా కుమార్, ఫిన్లాండ్ - రామకృష్ణ, యునైటెడ్ కింగ్డమ్ -నవీన్ సామ్రాట్, శ్యామ్ సుందర్ రావ్, డా. శేఖర్ తదితరుల భాగస్వామ్యంతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరుపుటకు అన్ని ఏర్పాట్లు  సర్వం సిద్ధమైనవి ఆదివారం జరిగిన కాన్ఫెరెన్స్ కాల్ ద్వారా ధృవీకరించుకుని తెలుగుదేశం అధినాయకత్వానికి తెలియపరిచామని ఆదివారం తెలుగుదేశం యూరప్ విభాగం మీడియా సమన్వయకర్త శ్రీనివాస్ ప్రెస్నోట్ విడుదల చేశారు. 

యూరప్‌లోని 63 నగరాల్లో తెలుగుదేశం 40వ వార్షికోత్సవ వేడుకలు


TAGS: NRI TDP europe
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.