Ola, Uber సహా... అన్ని వాహనాలూ EVలుగా మారాల్సిందే

ABN , First Publish Date - 2022-07-06T03:24:40+05:30 IST

ola, uber మినహాola, uber మినహా అన్ని వాహనాల అగ్రిగేటర్లు 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ola, Uber సహా...  అన్ని వాహనాలూ EVలుగా మారాల్సిందే

- ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు

న్యూఢిల్లీ : ola, uber మినహాola, uber మినహా అన్ని వాహనాల అగ్రిగేటర్లు 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జారీ అయిన నోటిఫికేషన్‌లో... ఏప్రిల్ 1, 2030 నాటికి మొత్తం మూడు, నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలు, రెండు, మూడు & నాలుగు చక్రాల వాణిజ్య వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్ ఫ్లీట్‌కు ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆశిష్ కుంద్రా... ‘ఈ ఆదేశాలు అన్ని అగ్రిగేటర్లకు వర్తిస్తాయి. ola, uber తదితర వాహనాలకు మినహాయింపులకు సంబంధించి వివరాలు తెలిపాం’ అని వెల్లడించారు. కాగా... 2030 నాటికి 100 శాతం వాహనాలు ‘Electric’గా మారాలనే లక్ష్యాన్ని సాధించడానికిగాను గడువును నాలుగేళ్లపాటు పొడిగించినట్లు కుంద్రా చెప్పారు. ఢిల్లీ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ స్కీమ్ 2022 స్కీం  గురించి మాట్లాడుతూ... ప్రభుత్వం అగ్రిగేటర్లకు, ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆన్-బోర్డింగ్ చేయడానికి సంబంధించిన  ప్రోత్సాహకాలను ఈ పథకం హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు లైసెన్స్ రుసుము లేదని వెల్లడించారు. 

Updated Date - 2022-07-06T03:24:40+05:30 IST