శరీరంలో కలిగే అలెర్జీలు.. వాటి ప్రభావాలు

ABN , First Publish Date - 2022-07-09T01:32:35+05:30 IST

అలెర్జీ అంటే ఏమిటి? వైద్య పరిభాషలో అలెర్జీ అంటే రోగనిరోధక వ్యవస్థకు హైపర్‌సెన్సిటివిటీని సూచిస్తుంది.

శరీరంలో కలిగే అలెర్జీలు.. వాటి ప్రభావాలు

అలెర్జీ అంటే ఏమిటి? వైద్య పరిభాషలో అలెర్జీ అంటే రోగనిరోధక వ్యవస్థకు హైపర్‌సెన్సిటివిటీని సూచిస్తుంది. శరీరంలోని హాని చేయని అలర్జెన్స్ మీద రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినపుడు అలర్జీ వస్తుంది. అయితే ఈ అలెర్జీలు మరీ ప్రమాదకరం కాకపోయినా, సున్నితమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారు ఎవరైనా వీటి బారినపడి ఇబ్బంది పడుతుంటారు. మనలో చాలామందికి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. గాలితో వ్యాపించే అలెర్జీలు కొన్ని అయితే, ఆహారంతో వ్యాపించేవి మరికొన్ని. పక్షులు, కొన్నిరకాలు జంతువులు వల్ల కూడా ఈ అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


ఈ పదార్ధాలను invasive foregin particlesగా (మన దేహం లోపలి వాతావరణానికి సరిపడక హాని చేసే పదార్థాలు) మన శరీరం పరిగణిస్తుంది. వర్షం, దుమ్ము నుంచి పుప్పొడి వరకు, ఏదైనా అలెర్జీని ప్రేరేపిస్తుంది. సాధారణంగా, అలెర్జీలు చర్మం మంటగా లేదంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కనిపిస్తాయి. మనలో కలిగే ఈ అలర్జీల ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. వాటి తీవ్రత కూడా శరీరతత్వాన్ని బట్టి అదే విధంగా ఉంటాయి. అలెర్జీలు ఎంత చిన్నగా మొదలైనా దానిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పదే పదే సొంత వైద్యం చేసుకోవడం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు. మొదటి దశలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించడం వల్ల సులభంగా పరిష్కారం దొరుకుతుంది. 


ఆహారం వల్ల కలిగే అలెర్జీలు వాటి ప్రభావం..

ఆహారం వల్ల కలిగే అలెర్జీల లక్షణాలలో చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, వాపు ఉంటాయి. మరీ ప్రమాదకరమైన కేసుల్లో వాంతులవడం, విరేచనాలవడం, ఊపిరాడకపోవడం వంటివి ఉంటాయి. అలాగే, శరీరానికి సరిపడని ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు రియాక్షన్స్ కలగవచ్చు. అలాగే వీటికి తమకు తోచినట్టు సొంతంగా మందులను వాడటం కూడా ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర తత్వాన్ని బట్టి ప్రతి ఒక్కరిలోనూ ఒక్కోరకంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. అలెర్జీలు కలిగించే లక్షణాలు గురించి తెలుసుకుందాం..


అలెర్జీలు రకాలు..

* (dust) దుమ్ము అలెర్జీ 

* కారుతున్న లేదంటే, దిబ్బడేసిన ముక్కు

* చీదటం

* ఎరుపుదనం, దురదగా ఉండి నీరు కారుతున్న కళ్ళు

* దగ్గు, ఛాతీలో బిగుతుతో పెట్టే గురక


అలెర్జిక్ రైనైటిస్ 

* కారుతున్న లేదంటే, దిబ్బడేసిన ముక్కు

* కంట్లో, చర్మం మీద దురద

* చీదటం

* ముక్కు పట్టేయడం వలన కలిగే నిద్రలేమి కారణంగా అలసట, నీరసం.


స్కిన్ అలెర్జీలు 

*  స్కిన్ అలెర్జీ లక్షణాలు సాధారణంగా ఒకే రకంగా ఉండకపోవచ్చు 

* చర్మం ఎరుపుగా మారడం, దురద, వాపు ఉంటాయి. 


కాంటిక్ట్ డెర్మటైటిస్ (తామర) 

* తామర ఉన్న వారిలో పుండ్లు మానుపట్టినా చర్మం దురద కలిగి ఉంటుంది. 


యుర్టికేరియా 

* యుర్టికేరియాలో చర్మం ఎర్రగా మారి మండుతుంది. ఎరుపు రంగు గడ్డలు ఏర్పడతాయి. 

ఇవి కొన్నిసార్లు జననేంద్రియాలలో లేదా గొంతు, పేగుల లోపుల కూడా ఏర్పడుతూ ఉంటాయి. 


కీటకాలు, పెంపుడు జంతువుల అలెర్జీ 

* పెంపుడు జంతువుల వల్ల కలిగే అలెర్జీ లక్షణాలు దుమ్ము అలెర్జీకి దగ్గరగా ఉంటుంది.  

* ముఖం, పెదవులు, గొంతుపైన మొటిమలు రావడం, నాలుక ఉబ్బటం

* శ్వాసలో ఇబ్బందులు

* మంట ఉన్నచోట దురద యుర్టికేరియా దద్దుర్లు, చిన్నచిన్న పొక్కులు కనిపిస్తాయి.

* వికారం, వాంతులు

* కడుపులో నొప్పి


ఆహారంతో అలెర్జీ 

* ఫుడ్ అలెర్జీ లక్షణాలు తిన్న వెంటనే లేదా కొన్ని గంటల్లో ప్రభావం కనిపిస్తుంది. వాటిలో ఎరుపుదనం, చర్మంపై దురద, పట్టేసిన ముక్కు, వికారం, వాంతులు, తిమ్మిరి, అతిసారం ముఖ్యంగా కనిపిస్తాయి. 

* ఛాతీలో బిగుతుగా ఉండటం

*నాలుక, గొంతు, పెదవులు వాపు

*చేతులు, కాళ్ళు మండటం.


ఈ జాగ్రత్తలు అవసరం 

అలెర్జీని నివారించాలంటే ముందు మనకు పడని వాతావరణానికి, పరిస్థితులకు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తరచుగా ఈ అలెర్జీల బారిన పడకుండా ఉండవచ్చు.


Updated Date - 2022-07-09T01:32:35+05:30 IST