రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు..

ABN , First Publish Date - 2022-05-16T08:38:54+05:30 IST

జాతీయవాదం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు అన్ని భావసారూప్య పార్టీలతో చర్చలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు..

జాతీయవాదం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు అన్ని భావసారూప్య పార్టీలతో చర్చలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులకు ద్వారాలు తెరచి ఉంచినట్లు తెలిపింది. భారత జాతీయవాదం కాంగ్రెస్‌ ప్రధాన స్వభావమని.. బీజేపీది అధికార వ్యామోహంపై ఆధారపడిన నకిలీ జాతీయవాదమని డిక్లరేషన్‌ విమర్శించింది. జమ్మూకశ్మీరుకు రాష్ట్ర హోదాను, ప్రత్యేకప్రతిపత్తిని తీసివేయడం, ఎన్నికలు జరపకపోవడం, లోపభూయిష్టంగా నియోజకవర్గాల పునర్విభజన, ఉగ్రవాదులు వేల మంది అమాయక ప్రజలను, భద్రతాదళాలను, కశ్మీరీ పండిట్లను చంపడం మొదలైనవి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని విమర్శించింది. ‘దేశంలో మైనారిటీలను, పేదలను, బడుగు వర్గాలను టార్గెట్‌ చేసి ఓట్లు పొందే రాజకీయాలను తిరస్కరిస్తున్నాం. సమాఖ్య విధానంపై కేంద్రం దాడి మరింత ప్రమాదకరం. అధికారం పొందడానికి రాష్ట్రాల పరిధిలోకి చట్టవిరుద్ధంగా చొరబడడం బీజేపీ నైజంగా మారింది. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై చైనా దాడిచేసింది. కానీ ఈ వ్యవహారంలో కేంద్రంలో జవాబుదారీతనం లోపించింది. ప్రధాని మోదీ మౌనంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది’ అని తెలిపింది.

Updated Date - 2022-05-16T08:38:54+05:30 IST