Viral Video: మొసలి నోట్లో కొండ చిలువ.. చావడం ఖాయం అని అనుకునేలోపే సడన్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-05-08T17:15:30+05:30 IST

సోష‌ల్ మీడియాలో నిత్యం ప‌లు ర‌కాల వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల‌ను ఎక్కువ మంది చూసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు.

Viral Video: మొసలి నోట్లో కొండ చిలువ.. చావడం ఖాయం అని అనుకునేలోపే సడన్ ట్విస్ట్..!

సోష‌ల్ మీడియాలో నిత్యం ప‌లు ర‌కాల వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల‌ను ఎక్కువ మంది చూసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా ఒక కొండ చిలువ‌, మొస‌లికి సంబంధించిన వీడియో నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆ వీడియోలో కొండ చిలువ, మొస‌లి ఒక‌దానినొక‌టి చంపేందుకు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. చివ‌ర‌కు రెండూ ఒక‌దాని నుంచి మ‌రొక‌టి త‌ప్పించుకున్నాయి. 


ఆ వీడియో ప్రకారం.. నీటిలో ఉన్న మొస‌లిని చంపేందుకు కొండ‌చిలువ దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. కొండ‌చిలువను గ‌మ‌నించిన మొస‌లి ఫైట్ కు సిద్ధ‌మైంది. కొండ‌చిలువ‌ను రెండు ముక్క‌లుగా కొరికేసేందుకు ప్ర‌య‌త్నించింది. మొస‌లి శ‌రీరాన్న చుట్టేసి క‌రిచేందుకు కొండచిలువ ప్ర‌య‌త్నించింది. రెండూ ఆ పోరాటంలో హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. చివ‌ర‌కు రాజీ ప‌డి రెండూ ఒక‌దానికొక‌టి దూరంగా వెళ్లిపోయాయి. ఈ వీడియోను యానిమ‌ల్స్ ఎన‌ర్జీ అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశారు. ఆ వీడియోకు లైక్ ల వ‌ర్షం కురుస్తోంది. 



Read more