జేఈఈ అడ్వాన్స్‌లో ఆలిండియా రెండో ర్యాంకు

ABN , First Publish Date - 2021-10-17T07:05:29+05:30 IST

జాతీయస్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్‌ పరీక్ష ఫలితాల్లో మండల పరిధిలోని లింగంవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన ఆలిండియా బాలికల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది.

జేఈఈ అడ్వాన్స్‌లో ఆలిండియా రెండో ర్యాంకు

బాలికల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పల్లె భావన

సంస్థాన్‌ నారాయణపురం, అక్టోబరు 16: జాతీయస్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్‌ పరీక్ష ఫలితాల్లో మండల పరిధిలోని లింగంవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన ఆలిండియా బాలికల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. అదేవిధంగా దక్షిణ భారత దేశస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. లింగంవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె శేఖర్‌రెడ్డి, సరళ దంపతుల కుమార్తె భావన చిన్నతనంనుంచే చదువులో ముందంజలో ఉంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చౌటుప్పల్‌లోని అన్న మెమోరియల్‌ హైస్కూల్‌లో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్‌లోని నారాయణ హైస్కూల్‌లో చదివింది. ఇంటర్‌ విద్యను సైతం నారాయణ కళాశాలలో పూర్తి చేసింది. ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియాలో 4వ ర్యాంకు సాధించింది. తాజాగా ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షల్లో జాతీయస్థాయిలో సత్తా చాటింది. బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాంకు, దక్షిణ భారతదేశం విభాగంలో మొదటి ర్యాంకు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. జనరల్‌ విభాగంలో 107వ ర్యాంకు సాధించింది. జాతీయస్థాయిలో రికార్డు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-17T07:05:29+05:30 IST