బాధితులందరికీ బెడ్లు కేటాయించండి

ABN , First Publish Date - 2021-04-24T05:12:20+05:30 IST

జిల్లాలో ని కొవిడ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రు ల్లో బెడ్ల కేటాయింపు సరైన రీతిలో జరగాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.

బాధితులందరికీ బెడ్లు కేటాయించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

  కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 23: జిల్లాలో ని కొవిడ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రు ల్లో బెడ్ల కేటాయింపు సరైన రీతిలో జరగాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.  కొవి డ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన ప్రైవే ట్‌, ప్రభుత్వ ఆసుపత్రుల యాజ మాన్యాలతో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం సాయం త్రం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ పాజిటివ్‌  బాధితులందరికీ ఆసుపత్రుల్లో చికిత్స అందిం చాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నవారిని ఇళ్ల వద్ద ఉంచి వైద్యం అందించాలని సూచించారు. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడు తున్న వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర అత్యవసర కేసులు మాత్రమే చేర్చుకుని చికిత్స అందించాలని తెలిపారు. సాధారణ కేసులకు కూడా బెడ్ల కేటాయించాలని చెప్పారు. బెడ్ల అందని పరిస్థితి ఉండకూడదన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఒకే సారి సేవలు ప్రారంభించకుండా దశల వారీగా ఆయా ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. అవసరమైన మేరకు మందులు సిద్ధం చేయాలని, నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే.. తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించడంతో పాటు వ్యాప్తి చెందకుండా  చర్యలు తీసు కోవాలన్నారు. జిల్లా ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా కోసం జిల్లా నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న డ్రగ్స్‌ కంట్రోల్‌ ఏడీని సంప్రదించాలని జేసీ మహేష్‌ కుమార్‌ సూచించారు. ఆక్సిజన్‌ పైపు లైన్లు సక్రమంగా ఉన్నవీ లేనివీ తనిఖీ చేయాలని ఏపీ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఈఈని ఆదేశించారు. ఆక్సిజన్‌ వృథా కాకూడదని చెప్పారు.  డీసీహెచ్‌ఎస్‌ జి.నాగభూషణరావు మాట్లాడుతూ... ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యమని, 24 గంటలూ ఆసుపత్రులు పని చేయాలని తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రమణకుమారి తదితరులు ఉన్నారు. 


 

Updated Date - 2021-04-24T05:12:20+05:30 IST