సీఎం కార్యాలయంలో అధికారులకు శాఖల కేటాయింపు

ABN , First Publish Date - 2022-03-02T23:21:43+05:30 IST

సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలను కేటాయిస్తూ స్పెషల్

సీఎం కార్యాలయంలో అధికారులకు శాఖల కేటాయింపు

విజయవాడ: సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలను కేటాయిస్తూ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీ, హోంశాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్యశాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో, ఎస్టాబ్లిష్‌మెంట్ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డికి కేటాయించారు. సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్‌కు పౌరసరఫరాలు, విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలను కేటాయించారు. 


సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధరంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంథన శాఖ, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలను కేటాయించారు. సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజుకు ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖలను కేటాయిస్తూ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2022-03-02T23:21:43+05:30 IST