ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి: కేటీఆర్‌కు రైతు వినతి

Published: Sat, 22 Jan 2022 15:49:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి: కేటీఆర్‌కు రైతు వినతి

నల్గొండ: తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు ఓ యువరైతు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. జిల్లాలోని కనగల్ మండలంలో జి. యెడవల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే యువరైతు  ఈ ట్వీట్ చేశాడు. తాను ఉన్నత చదువులు చదువుకున్నానని, కానీ ఉద్యోగం దొరక్కపోవడంతో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని ట్విట్టర్‌లో ఆ రైతు  పేర్కొన్నాడు.


అయితే పల్లె ప్రకృతివనం పేరుతో తనకున్న అయిదు ఎకరాల భూమిని అధికారులు లాక్కున్నారని బాధితుడు ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. తనకు ఉద్యోగం లేదని, తనకు ఉన్న భూమిని లాక్కోవడంతో ఉపాధిని కోల్పోయానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు తాను ఎన్నోమార్లు ఫిర్యాదు చేశానని బాధితుడు పేర్కొన్నాడు. చివరకు దిక్కులేక చావుకు సిద్దపడ్డాడనని ఆ ట్వీట్‌లో రైతు తెలిపాడు. కేటీఆర్‌కు ట్విట్టర్‌లో 500 పోస్టులు పెట్టాడు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారుతోంది.  

ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి: కేటీఆర్‌కు రైతు వినతి


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.