పార్లమెంటరీ కమిటీ సమావేశాలను వర్చువల్‌గా పెట్టండి : ఓ బ్రెయిన్

ABN , First Publish Date - 2021-05-10T00:02:03+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటరీ కమిటీల సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని తృణమూల్ ఎంపీ డెరెక్

పార్లమెంటరీ కమిటీ సమావేశాలను వర్చువల్‌గా పెట్టండి : ఓ బ్రెయిన్

కోల్‌కతా : ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటరీ కమిటీల సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ రాశారు. దేశంలోని పలు సమస్యలను అత్యంత జవాబుదారీతనంతో చర్చించిన వారమవుతామని పేర్కొన్నారు. ‘‘గత రెండు వారాలుగా భారత్ లో మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటి దృష్ట్యా ఆయా పార్టమెంటరీ కమిటీలు, సెలెక్ట్ కమిటీ సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించమని మరోసారి కోరుతున్నాను’’ అంటూ ఓ బ్రెయిన్ లేఖలో ప్రస్తావించారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ గతంలో కూడా ఈ విషయంలో లేఖలు రాశారు. 

Updated Date - 2021-05-10T00:02:03+05:30 IST