అనధికార దుకాణాలను అనుమతించం : ఏసీపీ

ABN , First Publish Date - 2021-04-24T04:12:50+05:30 IST

ప్రధాన రహదారికి ఆనుకుని ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న అనధికార దుకాణాలను అనుమతించే ప్రసక్తేలేదని జీవీఎంసీ 8 జోన్‌ ఏసీపీ మధు స్పష్టం చేశారు.

అనధికార దుకాణాలను అనుమతించం : ఏసీపీ
దుకాణాలను తొలగిస్తున్న జీవీఎంసీ సిబ్బంది

సింహాచలం, ఏప్రిల్‌ 23: ప్రధాన రహదారికి ఆనుకుని ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న అనధికార దుకాణాలను అనుమతించే ప్రసక్తేలేదని జీవీఎంసీ 8 జోన్‌ ఏసీపీ మధు స్పష్టం చేశారు. జీవీఎంసీ కమిషనర్‌ డా.జి.సృజన ఆదేశాల మేరకు రెండురోజులుగా అనధికార దుకాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టామన్నారు. ఈ దుకాణాలతో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సింహాచలం స్వామి దర్శనానికి వచ్చే వాహనాలతో గోశాల నుంచి పాత అడివివరం వరకు రద్దీ ఏర్పడుతోందని, దీంతో సింహాచలం బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఏసీపీ తెలిపారు. దుకాణాల తొలగింపులో గోపాలపట్నం ట్రాఫిక్‌ సీఐ శ్రీహరిరాజు, ఎస్‌ఐ వెంకటరావు, టీపీవో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:12:50+05:30 IST