అల్లు అర్జున్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభించనున్నారనీ, సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈలోపు, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’తో పాటు చిరంజీవి-రామ్చరణ్ తారాగణంగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ పూర్తి కానున్నాయి.
ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సందేశం ఇవ్వడం కొరటాలకు అలవాటు. అల్లు అర్జున్ కోసం జలకాలుష్యం నేపథ్యంలో వాణిజ్య విలువలు పుష్కలంగా ఉన్న కథను సిద్ధం చేసినట్టు వినికిడి. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రణాళికల్లో ఉన్నారు. కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రానికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి సహ నిర్మాతలు.