‘ఆర్య‌’.. నా జీవితంలో జ‌రిగిన గొప్ప అద్భుతం: అల్లు అర్జున్‌

May 7 2021 @ 11:27AM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్య‌’. 2004లో సినిమా విడుద‌లైన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ‌డ‌మే కాదు.. అల్లు అర్జున్‌, సుకుమార్‌ల స్టార్స్‌గా మార్చేసింది. ఈ సినిమా విడుద‌లై నేటికి(మే 7) స‌రిగ్గా 17 ఏళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘‘నేటితో ‘ఆర్య’ విడుద‌లై 17 ఏళ్ల‌వుతుంది. నా లైఫ్ చేంజింగ్ విష‌యాల్లో ఈ సినిమా కూడా ఒక‌టి. నా జీవితంలో జ‌రిగిన ఓ గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్’  అనే బంగారు పదాలను నేను చెప్పిన తర్వాత ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌ను నాపై కురిపించారు’’ అని తెలిపారు అల్లు అర్జున్. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.