Advertisement

తాజ్ ముందు భార్యతో బన్నీ!

Mar 6 2021 @ 14:59PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇస్తాడు. వీలు కుదిరినప్పుడల్లా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళుతుంటాడు. ఈ రోజు (శనివారం) బన్నీ, స్నేహ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2011 మార్చి 6వ తేదీన బన్నీ, స్నేహల వివాహం జరిగింది. నేటితో వారి వివాహ బంధానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బన్నీ తన భార్య స్నేహతో కలిసి తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లాడు. 

 

ప్రేమసౌధం ముందు తన భార్యతో కలిసి ఫొటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. `మనకు 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు క్యూటీ. ఈ పది సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాల`ని బన్నీ కామెంట్ చేశాడు. ఈ క్యూట్ కపుల్‌కు ఇద్దరు పిల్లలు (అయాన్‌, అర్హ) ఉన్నారు. బన్నీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు.  


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.