ltrScrptTheme3

Varudu kavalenu : ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్‌గెస్ట్ గా అల్లు అర్జున్ !

Oct 26 2021 @ 11:15AM

యంగ్ హీరో నాగశౌర్య, రీతూవర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వరుడు కావలెను’. ఈ సినిమాను అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్న రీతిలో చేపడుతున్నారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ‘వరుడు కావలెను’ చిత్రం సంగీత్ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన చిత్ర బృందం.. అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 



ఇటీవల విడుదలైన ‘వరుడు కావలెను’ మూవీ ట్రైలర్, అంతకు ముందు విడుదలైన సింగిల్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో నాగశౌర్య నటించిన ‘కళ్యాణవైభోగమే’ హిట్ మూవీని ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నారు. అది కూడా వివాహ నేపథ్యంలో ఫ్యామిలీ రిలేషన్స్ ను హైలైట్ చేస్తూ సాగుతుంది. ‘వరుడు కావలెను’ సినిమా కూడా అదే నేపథ్యంలో డిఫరెంట్ కథా కథనాలతో ఉండబోతోంది. నాగశౌర్య స్ర్కీన్ ప్రెజెన్స్, రీతూవర్మ గ్లామర్ అపీరెన్స్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయంటున్నారు మేకర్స్.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.