స్ఫూర్తిప్రదాత అల్లూరి!

ABN , First Publish Date - 2022-06-28T05:43:47+05:30 IST

స్ఫూర్తిప్రదాత అల్లూరి!

స్ఫూర్తిప్రదాత అల్లూరి!
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, కలెక్టర్‌ ప్రశాంతి

ఘనంగా సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు ప్రారంభం
పోరాటపటిమ భావితరాలకు తెలియజెప్పేలా నిర్వహిస్తాం: కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, జూన్‌ 27: స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి అన్నారు. భీమవరం త్యాగరాజు భవనం నుంచి అల్లూరి 125వ జయంత్యుత్సవాలను సోమవారం  ప్రారం భించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిని వెలిగించి శ్రద్ధాంజలి ఘటిం చారు. అల్లూరి దేశానికి చేసిన నిస్వార్థ సేవ, పోరాటపటిమను భావితరాలకు తెలియ జెప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తా మని కలెక్టర్‌ పేర్కొన్నారు. దేశం, ప్రపంచం నలుమూలల తెలియవచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల పేరి ట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోం దన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అల్లూరి  ఉద్యమ స్ఫూర్తి తెలియజేయాలనే రాష్ట్ర ప్రభుత్వం వారంపాటు కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ తెలిపారు. అల్లూరి త్యాగాలను తలుచుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకోవడం గర్వకారణ మని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.



ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన, వేషధారణలు
తొలుత నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం తీన్మార్‌ డప్పుల వాయిద్యాలతో త్యాగరాజు భవనం నుంచి ప్రారంభమై ర్యాలీ  ప్రకాశం చౌక్‌ వరకు కొనసాగింది. అల్లూరి పోరాటాలపై నినాదాలు చేస్తూ, ప్లకార్డుల ప్రదర్శనతో కొనసాగింది. పట్టణంలో పలు పాఠశాల విద్యార్థులు, టీచర్లు, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొనారు. ఆర్డీవో దాసిరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, డీఈవో ఏవీ రమణ, మావుళ్లమ్మ దేవస్థానం చైర్మన్‌ నాగన్నబాబు, ఎంపీపీ పేరిచర్ల విజయ వెంకట నరసింహరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, విజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, ముదిరాజు కాశీ విశ్వనాథరాజు, గాదిరాజు సుబ్బరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T05:43:47+05:30 IST