జయంత్యుత్సవాల్లో భాగస్వామ్యం..అదృష్టం

ABN , First Publish Date - 2022-07-05T06:04:59+05:30 IST

అల్లూరి జయంత్యుత్సవాల్లో ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సిబ్బంది, విద్యార్థులు భాగస్వాములవడం అదృష్టంగా భావిస్తున్నామని కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ తెలిపారు.

జయంత్యుత్సవాల్లో భాగస్వామ్యం..అదృష్టం
సభలో ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

కలెక్టర్‌, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు : నిశాంతవర్మ


భీమవరం ఎడ్యుకేషన్‌, జూలై 4: అల్లూరి జయంత్యుత్సవాల్లో ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సిబ్బంది, విద్యార్థులు భాగస్వాములవడం అదృష్టంగా భావిస్తున్నామని కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ తెలిపారు. తమకు భాగస్వామ్యం కల్పించిన కలెక్టర్‌, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ సభా మార్గంలో 300 మీటర్ల జాతీయ జెండా ఏర్పాటు చేసే అవకాశం తమ కళాశాలకు కల్పించినందుకు, తమ విద్యార్థులు ఐదు వేల మందికి మూడు రంగుల జాతీయ జెండాలను పోలిన టీ షర్ట్‌లతో సభాప్రాంగణంలో ఎదుట కూర్చునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారం పాటు  నిర్వహించిన కార్యక్రమాల్లో నాలుగు వేల మంది విద్యార్థులతో ఉత్సవాలు దిగ్విజయం కావాలని చేసిన ర్యాలీ అందరి మన్ననలను పొందిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు పేర్కొ న్నారు. మోగల్లులో అల్లూరి విగ్రహం ప్రాంతాన్ని స్మృతివనంగా అభివృద్ధి చేసే అవకాశం తమ కళాశాలకు దక్కడం అదృష్టంగా యాజమాన్యం భావిస్తోంది

Updated Date - 2022-07-05T06:04:59+05:30 IST