అల్మా్‌సగూడలో పార్కు స్థలం కబ్జా

ABN , First Publish Date - 2021-02-25T05:35:57+05:30 IST

మునిసిపల్‌ రికార్డుల్లో పార్కు స్థలం(ఓపెన్‌ ఏరియా)గా పేర్కొన్న బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అల్మా్‌సగూడ 3వ వార్డు పరిధిలో గల దాదాపు రూ.80లక్షల విలువ చేసే 200 గజాల స్థలాన్ని ఓ వెంచర్‌కు సంబంధించిన జీపీఏ హోల్డర్‌ మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు.

అల్మా్‌సగూడలో పార్కు స్థలం కబ్జా
ఖాళీ స్థలం వద్ద మునిసిపల్‌ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు

- మునిసిపల్‌ బోర్డు ఉండగానే వేరొకరికి రిజిస్ట్రేషన్‌

- మేయర్‌, డిప్యూటీ మేయర్లకు కార్పొరేటర్‌ ఫిర్యాదు

సరూర్‌నగర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ రికార్డుల్లో పార్కు స్థలం(ఓపెన్‌ ఏరియా)గా పేర్కొన్న బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అల్మా్‌సగూడ 3వ వార్డు పరిధిలో గల దాదాపు రూ.80లక్షల విలువ చేసే 200 గజాల స్థలాన్ని ఓ వెంచర్‌కు సంబంధించిన జీపీఏ హోల్డర్‌ మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ రామిడి మాధురీవీరకర్ణారెడ్డి దీనిపై బుధవారం మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఇక్కడి సర్వే నంబర్లు.61,72,133లలో గతంలో వెంచర్‌ చేసి ఇళ్లు నిర్మించగా దానికి సీఎంఆర్‌ కాలనీగా నామకరణం చేసుకున్నారు. సదరు కాలనీలో అప్పట్లో ప్లాటు నంబర్లు.89, 122లలో వంద గజాల చొప్పున(మొత్తం 200 గజాలు) ప్రజోపయోగార్థం ఓపెన్‌ ఏరియాగా వదిలి పెట్టారు. మునిసిపల్‌ అధికారులు గతంలో ఇక్కడ ‘ఈ స్థలం బడంగ్‌పేట్‌ నగర పంచాయతీకి చెందినది’ అని బోర్డు కూడా పెట్టారు. స్థానికులు ఆర్టీఐ ప్రకారం సేకరించిన వివరాల్లోనూ అధికారులు ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే ఇటీవల సదరు వెంచర్‌ చేసిన జీపీఏ హోల్డర్‌,  కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మరికొందరు స్థానిక నాయకులు కలిసి ఆ  200 గజాల ఖాళీ స్థలాన్ని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. కార్పొరేటర్‌ మాధురీవీరకర్ణారెడ్డి ఆయా డాక్యుమెంట్లు అన్నీ జత చేసి మేయర్‌, డిప్యూటీ మేయర్లకు ఈ కబ్జాపై ఫిర్యాదు చేశారు. రూ80లక్షల విలువైన ఈ స్థలాన్ని కాపాడాలని ఆమె కోరారు. దీనికి వారు స్పందిస్తూ మంత్రి సబితారెడ్డి సైతం ఖాళీ స్థలాలు కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదే అని స్పష్టంగా పేర్కొన్నారని, ఈ దృష్ట్యా అల్మా్‌సగూడలోని ఖాళీ స్థలంతో పాటు ఇతర వార్డుల్లోని ఖాళీ స్థలాలను సైతం కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ స్పోర్ట్స్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌ రామిడి శూరకర్ణారెడ్డి, జక్కిడి శశివర్ధన్‌రెడ్డి, రామిడి విఘ్నేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-25T05:35:57+05:30 IST