ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-07T05:23:21+05:30 IST

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి
మహేశ్వరం: తుమ్మలూరు గ్రామ రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 


కందుకూరు/షాద్‌నగర్‌అర్బన్‌/మహేశ్వరం/షాబాద్‌/ఆమనగల్లు/కడ్తాల/చేవెళ్ల: యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఇతర లాభసాటి పంటలను సాగుచేసుకోవాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. కందుకూరులో  ఇన్‌చార్జి మండల వ్యవసాయశాఖ అధికారి పి.యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి ఆర్‌డీవో వెంకటాచారితో కలిసి అకస్మింకంగా తనిఖీ చేసి మాట్లాడారు. వరిధాన్యం నిల్వలు అధికంగా ఉండడం వలన రైతులు ఆరుతడి పంటల సాగు చేయాలన్నారు. తమకు గతంలో సబ్సిడీపై మంజూరు చేసిన తరహాల్లో డ్రిప్పు, స్పింక్లర్లను మంజూరు చేయాలని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి రైతులు కోరినట్లుగా రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డ్రిప్పు, స్పింక్లర్ల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల ఇన్‌చార్జి వ్యవసాయశాఖ అధికారి పి.యాదగిరి మాట్లాడుతూ పంట దిగుబడి వచ్చేపెసర్లు, జొన్న, పొద్దుతిరుగుడు, మినుములు, కూరగాయలు, ఆకుకూరల పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ జి.ప్రభాకర్‌, ఎంపీటీసీ ఉండెల రేఖ, ఏఈవో అర్చన, పీఏసీఎస్‌ డైరక్టర్‌ జి.వెంకటేష్‌, కె.శ్రీశైలం పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ పరిధి ఫరూఖ్‌నగర్‌ మండల పరిషత్‌ ఆవరణలో సోమవారం యాసంగి పంటల సాగుపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే  వై.అంజయ్యయాదవ్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్లు బక్కన్నయాదవ్‌, చిట్టెం దామోదర్‌రెడ్డి, అశోక్‌, ఎంపీపీ ఖాజా ఇద్రీ్‌షఅహ్మద్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో వ్యవసాయ అధికారులు నిర్వహించిన సదస్సులో కలెక్టర్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మద్దికరుణాకర్‌రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలోని వెంకమ్మగూడలో జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మండలంలోని కక్కులూర్‌, అప్పారెడ్డిగూడ, కేశవగూడ, హైతాబాద్‌, బోనగిరిపల్లి, తిమ్మారెడ్డిగూడ, గ్రామాల్లో ఏఈవోలు రైతులకు  అవగాహన కల్పించారు. ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయాధికారి వెంకటేశం, ఏఈవోలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లులోని ఆయా గ్రామాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణకుమారి, సర్పంచులు నర్సింహారెడ్డి, సోనశ్రీను నాయక్‌, పబ్బతి శ్రీనయ్య, లక్ష్మణ్‌లు రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఏవో అరుణకుమారి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాణి, సాయిరామ్‌, శివతేజ, మౌన్య, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామంలో ఆరుతడి పంటల సాగుపై ఏవో శ్రీలత ఆధ్వర్యంలో రైతు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జంగం సుగుణ సాయిలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డిగూడ, ఆలూర్‌, ఘనాపూర్‌, చనువల్లి, చేవెళ్ల, ఊరెళ్ల తదితర గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి కృష్ణమోహన్‌ రైతులకు అవగాహన  క్పపంచారు. కార్యక్రమంలో సర్పంచులు ఎం.మోహన్‌రెడ్డి, బండారు శైలజారెడ్డి, విజయలక్ష్మీ, ఏఈవోలు శివ, రమేశ్‌, స్వాతి, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:23:21+05:30 IST