ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-12-07T06:41:09+05:30 IST

రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంట లు సాగు చేయాలని జేడీఏ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేది క భవనంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జేడీఏ శ్రీధర్‌రెడ్డి

జేడీఏ శ్రీధర్‌రెడ్డి


శాలిగౌరారం, డిసెంబరు 6: రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంట లు సాగు చేయాలని జేడీఏ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేది క భవనంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. పంటల మార్పిడితో రైతులకు అధిక దిగుబడితో పాటు తెగుళ్ల బెడద ఉండదన్నారు.డిమాండ్‌ ఉన్న పంటలను సేద్యం చేయాలని సూచించారు.యాసంగిలో వరి కిబదులు వేరుశనగ, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, కంది,ఆయిల్‌పాంతో పా టు కూరగాయల పంటలు సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి సంగీతలక్ష్మి, విద్యాసాగర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సౌమ్యశృతి, ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నవీన్‌, అశ్విని, కీర్తి ఉన్నారు.

Updated Date - 2021-12-07T06:41:09+05:30 IST