ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు
చాగలమర్రి, మార్చి 27: చాగలమర్రి గ్రామంలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాదు, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 70 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 20 సంవత్సరాల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం పూర్వ ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్‌రెడ్డి, అప్పటి ఉపాధ్యాయులైన సుందరయ్య, మౌలాలి, రాజ్‌కుమార్, రామకృష్ణ, ఉపాధ్యాయేతర సిబ్బంది బాలస్వామి, జీవరత్నమ్లను శాలువ, పూలమాలలతో సన్మానించారు. అనంతరం మృతి చెందిన పూర్వ ఉపాధ్యాయులైన సురే్షవర్మ, నారాయణమ్మ, చిన్నపురెడ్డి, దస్తగిరిలకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు రాజేష్, చంద్రశేఖర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, కరిముల్లా, వెంకటేష్, పార్థసారధిరెడ్డి, మధు, జీవన్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.