ఎల్లవేళలా అండగా ఉంటా

Jun 16 2021 @ 23:28PM
సింగోటం గ్రామంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి జూపల్లి

- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, జూన్‌ 16 : నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ఆపద లో ఉన్నవారిని ఆదుకుంటానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొ ల్లాపూర్‌ మండల పరిధిలోని మాచినేనిపల్లి గ్రామం నుంచి సింగోటం గ్రామం వరకు  కార్యక ర్తలతో కలిసి మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచినేపల్లి, సింగోటం గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను జూపల్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సింగో టంలో గ్రామస్థులు పలు సమస్యలను తెలియజేశారు.  ఎప్పటికప్పుడు సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని జూపల్లి పేర్కొన్నారు. అనంతరం సంతలో రైతులతో ముచ్చటించారు. జూపల్లి వెంట మాజీ సర్పంచ్‌ వెంకటస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు యాదన్నగౌడ్‌, సింగోటం, మాచినేని పల్లి, కొల్లాపూర్‌ నాయకులు పాల్గొన్నారు. 

Follow Us on: