AP Cm Jagan సభలు ఎందుకు వెలవెలబోతున్నాయి?

ABN , First Publish Date - 2022-05-17T01:14:47+05:30 IST

ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ సభల నుంచి జనం వెళ్లిపోతున్నారు. ఇటీవల తిరుపతి సభలో..

AP Cm Jagan సభలు ఎందుకు వెలవెలబోతున్నాయి?

అమరావతి: ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ (Ap Cm Jagan) సభల నుంచి జనం వెళ్లిపోతున్నారు. ఇటీవల తిరుపతి (Tirupati) సభలో జగన్ ప్రసంగిస్తుండగానే అక్కడి నుంచి జనాలు వెళ్లిపోయారు. తాజాగా ఏలూరు (Eluru)లో జరిగిన కార్యక్రమం నుంచి కూడా ప్రజలు వెళ్లిపోయారు. రైతు భరోసా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం జగన్ ప్రసంగిస్తున్నారు. అయితే సభ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోయారు. అలా చాలా మంది సభలో నుంచి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ నేతలే విస్మయానికి గురవుతున్నారు. వెళ్లొద్దని చెబుతున్నా జనాలు మాత్రం సభల నుంచి వెళ్లిపోతున్నారు.  చేసేదేమీ లేక తలలు పట్టుకున్నారు.  


ఈ నేపథ్యంలో ‘‘జగన్ పథకాల డొల్లతనం జనానికి అర్థమైపోయిందా?.సంక్షేమం మాటున అంతులేని దోపిడీని జనం కనిపెట్టేశారా?. తనకు విశ్వసనీయత లేదని జగన్ కు అర్థం కావడం లేదా?.జనం కోసం పోరాడే వారిని నిందిస్తే జనం సహిస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తిడితే జనం ఊరుకుంటారా?. బటన్ నొక్కే సభల ఫెయిల్యూర్స్ వైసీపీని బెంబేలెత్తిస్తున్నాయా?. జగన్ సభలు ఎందుకు వెలవెలబోతున్నాయి?. సభలకొచ్చిన జనం ఎందుకు పారిపోతున్నారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-05-17T01:14:47+05:30 IST