
నటి అమలాపాల్ ఇటీవల ఆధ్యాత్మిక చింతనవైపు దృష్టి పెట్టింది. గతాన్నిగానీ, తన రెండో వివాహ విషయాన్ని గానీ ఎప్పుడూ, ఎక్కడా ఎవరూ ప్రస్తావించవద్దని మీడియాతో పాటు తన హితులు, సన్నిహితులకు ఆమె స్పష్టం చేసింది. పైగా ఈ రెండు విషయాల ప్రస్తావన తీసుకొస్తే మాత్రం ఆమెకు ఎక్కుడలేని కోపం వస్తోంది. ఈమె 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిమధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా గత 2017లో విడాకులు పొందారు. అప్పటి నుంచి అమలాపాల్ ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. ఈ క్రమంలో తనను కలిసేందుకు వచ్చే వారు అడుగుతున్న మొదటి ప్రశ్న.. రెండో పెళ్ళి గురించే. ఈ మాట వినగానే అసహనాన్ని ప్రకటిస్తోంది.
ఆమె ఇటీవల తన వాట్సాప్ సందేశాలను కూడా చూడటం మానేసిందట. దీనికి కారణం, కొందరు సన్నిహితులు పెళ్ళి ప్రస్తావన తెస్తూ సందేశాలు పంపుతుండడమే. మరోవైపు, అమలాపాల్ మనసు ఉన్నట్టుండి ఆధ్యాత్మిక చింతనవైపు మళ్ళింది. అందుకే ఆమె నిరంతరం ధాన్యంతో పాటు యోగా సాధన, వ్యాయామం చేస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ కాలక్షేపం చేస్తోంది. ఇకపోతే, పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లలో నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది.